రాష్ట్రపతిని కలిసిన ఈసీ బృందం

రాష్ట్రపతిని కలిసిన ఈసీ బృందం

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ ఆరోడా, ఇద్దరు కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలు రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా నూతన ఎంపీల జాబితాను ఎన్నికల సంఘం రాష్ట్రపతికి అందజేసింది. నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ కాపీని, ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. రాజ్యాంగం ప్రకారం 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి చొరవ తీసుకొనేందుకు ఈ జాబితా రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. శనివారం సాయంత్రం ఎన్డీఏలో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా సమావేశమై నరేంద్రమోడీని తమ నేతగా ఎన్నుకోనున్నారు.