కోవింద్‌ విషెస్‌.. కేసీఆర్‌ థ్యాంక్స్‌..

కోవింద్‌ విషెస్‌.. కేసీఆర్‌ థ్యాంక్స్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.చంద్రశేఖరరావు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవకు అంకితం కావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈమేరకు ఇవాళ ఆయన ముఖ్యమంత్రికి లేఖ పంపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.