రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు... దయ అవసరంలేదు...

రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు... దయ అవసరంలేదు...

ఓవైపు దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి.. మరోవైపు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇదే సమయంలో రేపిస్టులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని సిరోహిలో జరిగిన బ్రహ్మకుమారీస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యాచారాలకు ఒడిగడుతున్న మానవ మృగాలపై దయ చూపించాల్సిన అవసరం లేదన్నారు.. క్షమాభిక్షకు వారు అనర్హులనీ.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదని స్పష్టం చేశారు. క్షమాభిక్ష పిటిషన్లపై రివ్యూ జరగాలని.. మహిళల భద్రతా చాలా ముఖ్యమని.. పోక్సో చట్టం ప్రకారం, నేర పిటిషన్లు దాఖలు చేసే హక్కు నేరస్థులకు ఉండకూడదన్న ఆయన.. దయ పిటిషన్లను పార్లమెంటు సమీక్షించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అన్నారు.