రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్..

రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్..

పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలందరితో ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించగా... అనంతరం స్పీకర్ ఎన్నిక జరిగిపోయింది. ఇక ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి... కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 

రాష్ట్రపతి ప్రసంగంలోని కీలక అంశాలు:
* ఈ సారి మహిళా ఎంపీల సంఖ్య బాగా పెరిగింది.
* దాదాపు పురుషులతో సమానంగా మహిళా ఎంపీలున్నారు
* లోక్‌సభలో సగం మంది తొలిసారిగా ఎన్నికైన వారే
* యువత ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
* ఈసారి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు
* 2014 నుంచి కొనసాగుతోన్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు
* 2014కు ముందున్న పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలని జనం భావించారు
* ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మా ప్రభుత్వం పని చేస్తోంది
* శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తున్నాం
* రైతుల గౌరవాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నాం
* 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్లు అందిస్తాం
* వీర్‌జవాన్ స్కాలర్‌షిప్పులను రాష్ట్ర పోలీసుల పిల్లలకూ అందిస్తాం
* నదులు, కాల్వల ఆక్రమణ వల్ల జల వనరులు తగ్గిపోతున్నాయి
* స్వచ్ఛ భారత్ తరహాలో జల సంరక్షణ కార్యక్రమం చేపడతాం
* జల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు
* 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం
* ఆక్వా కల్చర్ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది
* దీని కోసం బ్లూ రివల్యూషన్ తీసుకొస్తాం
* జన్‌ధన్ యోజన ద్వారా ప్రతీ ఇంటికి బ్యాంకింగ్ సేవలను చేర్చాం
* పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెస్తాం
* మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నాం
* ఆయుష్మాన్ భారత్ కింది 20 కోట్ల మందికి ప్రయోజనం
* 2024 నాటికి దేశంలో 50 లక్షల స్టార్టప్స్ ఏర్పాటవుతాయి
* ఉన్నత విద్యాసంస్థల్లో 2 కోట్ల సీట్లు అదనంగా వస్తాయి
* ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
* క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు కృషి
* ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్ ముందుంది
* ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది
* మహిళల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
* దేశంలో బ్రూణ హత్యలు తగ్గాయి
* గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తాం
* ట్రిపుల్ తలాఖ్‌ను అరికట్టాలి
* జీఎస్టీ రాకతో పన్నుల వ్యవస్థ సులభమైంది
* జీఎస్టీ చెల్లించే వ్యాపాలరుకు రూ. 10లక్షల జీవిత బీమా అందిస్తున్నాం
* అవినీతి అంతానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం
* నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తాం
* విదేశాల్లో నల్లధనం దాచుకున్నవారి వివరాలను సేకరిస్తున్నాం
* 400కు పైగా పథకాలకు డీబీఎస్‌ను విస్తరించాం
* దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సదుపాం
* సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
* బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి
* 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.
* రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తాము.
* ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తాం. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. 
* నివాస, వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సాధికారతతోనే పేదరికాన్ని నిర్మూలించగలం.
* రైతులు, చిన్న వ్యాపారుల భద్రత కోసం ప్రభుత్వం పింఛను పథకం తీసుకొచ్చింది. 
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. 
* త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. జీఎస్‌టీని మరింత సరళీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 
* నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అక్రమ వలసదారులు దేశ భద్రతకు ముప్పు. అందుకే సరిహద్దుల్లో భధ్రతను పెంచుతాం. 
* 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం.
* భారత అంతరిక్ష సామర్థ్యం, దేశ భద్రతా సన్నద్ధతలో ‘మిషన్‌ శక్తి’ సరికొత్త అధ్యాయం. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయి. 
* మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడమే దీనికి రుజువు. దేశ భద్రతే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. 
* ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులు ఉగ్రవాదం పట్ల భారత్‌ తీరును స్పష్టం చేస్తున్నాయి. 
* తరచూ ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరగడం దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. 
* దేశం వేగంగా అభివృద్ది చెందేందుకు ’ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పద్ధతిని అమలు చేయాల్సిన సమయం వచ్చింది