ట్రిపుల్ తలాఖ్ పై మరోసారి ఆర్డినెన్స్ తెచ్చిన సర్కార్

ట్రిపుల్ తలాఖ్ పై మరోసారి ఆర్డినెన్స్ తెచ్చిన సర్కార్

ట్రిపుల్ తలాఖ్ పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్డినెన్స్ తెచ్చింది. ఇవాళ రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్ పై ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ట్రిపుల్ తలాఖ్ ని నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాఖ్ పై బిల్లుకి ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింద. దీంతో మరోసారి ఆర్డినెన్స్ తీసుకు రావాల్సి వచ్చింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ మరోసారి తీసుకురావాలని నిర్ణయించారు. సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ట్రిపుల్ తలాఖ్ కి సంబంధించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిందని, కానీ రాజ్యసభలో పెండింగ్ లో ఉందని తెలిపారు. ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో మొదటిసారి ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.