4న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక..

4న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆగస్టు 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు.  4వ తేదీన ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటిన తర్వాత కందిలోని ఐఐటీలో జరిగే 7వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పలు ఆదేశాలిచ్చారు.