మూడో టెస్టుకు పృథ్వీ షా?

మూడో టెస్టుకు పృథ్వీ షా?

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా మెల్‌బోర్న్‌లో జరిగే మూడో టెస్టుకు (బాక్సింగ్ డే టెస్టు) అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న షా బాక్సింగ్ డే టెస్టుకు ఫిట్ నెస్ సాధిస్తాడని కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ... 'గాయం కారణంగా షా మ్యాచ్‌కు దూరమవడం దురదృష్టకరం. యువకుడు కావడంతో త్వరగా కోలుకుంటాడు. ఇప్పుడిప్పుడే నడవడం ప్రారంభించాడు.. వారంలోగా అతడు పరుగెత్తగలడు. పెర్త్ టెస్టులోగా అతడిని టీమ్‌లోకి తీసుకునే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని' తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో గురువారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు.