దారుణం : కరోనా రాకున్నా వచ్చిందని చెప్పి, లక్షలు కడితేనే అంటూ !

 దారుణం : కరోనా రాకున్నా వచ్చిందని చెప్పి, లక్షలు కడితేనే అంటూ !

హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రులు బరితెగించాయి. ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ పేరు చెప్పి ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన రేటుకే వైద్యం చేయాలని సూచిస్తోన్నా,మందుల పేరుతో, పిపిఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఒక వ్యవహారమే రెండ్రోజుల క్రితం సోమాజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది.

ఒక కుటుంబం మొత్తాన్ని కరోనా చిదిమేయగా అందులో ఈ ఆసుపత్రి పాపం పంచుకుంది. అయితే ఈరోజు మరో దారుణం బయటకొచ్చింది. కరోనా లక్షణాలతో ఓ రోగి ఆసుపత్రి లో చేరగా పరీక్షల అనంతరం నెగిటివ్ వచ్చింది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి పాజిటివ్ వచ్చిన రోగులతో ఉంచింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే తమకి చికిత్స వద్దని డిశ్చార్జ్ చేయమని బ్రతిమిలాడినా లక్షలు చెల్లించాలని,ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినటు సమాచారం. దీంతో ఏమి చేయాలో పాలుపోక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.