హోదాపై రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ తీర్మానం

హోదాపై రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ తీర్మానం

ఏపీకి ప్రత్యేక హోదాపై రేపు రాజ్యసభలో ప్రైవేటు మెంబెర్ తీర్మానం ప్రవేశపెట్టనున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే ఈ చర్చకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం ద్వారా ఒక్కసారిగా మార్పులు ఆశించడం లేదన్నారు. కానీ ప్రత్యేక హోదా అవసరాన్ని మరింత లోతుగా తీసుకు పోవడం నా ఉద్దేశ్యమని చెప్పారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ అనంతరం... ఈ ప్రయత్నం మరో అడుగుగా కేవీపీ అభివర్ణించారు. తీర్మానం ప్రతితో పాటు... మరో ఐదు అంశాలను పెద్దల సభ ముందు ఉంచబోతున్నట్లు కేవీపీ తెలిపారు.