వందల బస్సులు రద్దు.. ఆందోళనలో ఓటర్లు !

వందల బస్సులు రద్దు.. ఆందోళనలో ఓటర్లు !

రేపు 11వ తేదీన ఏపీలో అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుండి ఆంధ్రావాసులు భారీగా సొంత ఊళ్లకు వెళ్లనున్నారు.  వీరిలో చాలామంది ప్రైవేట్ బస్సులనే నమ్ముకున్నారు.  10వ తేదీనాడు టికెట్లు బుక్  చేసుకుని ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.  కానీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం చివరి నిమిషంలో దాదాపు 125 బస్సులను రద్దుచేసి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది.  ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా కొన్ని బస్సులను రద్దుచేశాయి.    

సరిపడా డ్రైవర్లు లేనందున, సంస్థల్లోని ఇతరత్రా అంతర్గత కారణాల వలన యాజమాన్యాల బస్సులను రద్దుచేసినట్టు తెలుస్తోంది.  దీంతో దాదాపు 200 వరకు బస్సులు నిలిచిపోయాయి.  చివరి క్షణంలో ఇలా సర్వీసులు రద్దయ్యాయంటూ యాజమాన్యాలు చెప్పడంతో ఏపీకి వెళ్లాల్సిన ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు.