తెలుగులో పెద్ద సినిమానే పట్టిన ప్రియా వారియర్

తెలుగులో పెద్ద సినిమానే పట్టిన ప్రియా వారియర్

'వింక్' వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది.  తెలుగు దర్శక నిర్మాతలు సైతం ఆమెపై ఆసక్తి చూపారు.  కానీ అప్పట్లో మంచి క్రేజ్ ఉన్నందువలన ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది వారియర్.  దీంతో నిర్మాతలు ఆమెకు టాటా చెప్పారు.  దాదాపు వస్తాయన్న అన్ని అవకాశాలు ఆమె నుండి దూరంగా వెళ్లిపోయాయి.  ఇక ఆమెకు తెలుగులో ఎంట్రీ కష్టం అనుకున్నారు అందరూ. 

కానీ అనూహ్యంగా నితిన్ కొత్త సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కింది.  నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.  ఇందులో ఒక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాగా ఇంకో హీరోయిన్ ప్రియా ప్రకాష్.  మరి ఆలస్యమైనా మంచి పెద్ద సినిమానే పట్టిన ఆమె తన నటనతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.