అంగరంగ వైభోగంగా ప్రియాంక ఎంగేజ్మెంట్

అంగరంగ వైభోగంగా ప్రియాంక ఎంగేజ్మెంట్

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ పాప్ సింగర్ నీకీ జోనస్ ఎంగేజ్మెంట్ ఈరోజు ముంబైలో అంగరంగవైభోగంగా జరిగింది.  శుక్రవారం నీకీ జోనస్ తన తల్లి దండ్రులతో కలిసి ఇండియా వచ్చాడు. అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి కలిసి ఎంగేజ్మెంట్ విషయాలు మాట్లాడుకున్నారు.  ఈరోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.  

గత కొంతకాలంగా ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు.  2017 లో మొదటిసారి ఈ ఇద్దరు కలిశారు.  అక్కడి నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది.  కొన్ని రోజులుగా వీరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ వీరిద్దరూ ముంబై వేదికగా ఒక్కటయ్యారు.