శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది..

శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది..

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది... ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ సమక్షంలో శివసేనలో చేరారు ప్రియాంక చతుర్వేది. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల లేఖను రాశారు... కాంగ్రెస్ పార్టీనేతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారామె. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధి, మీడియా కన్వీనర్‌గా పనిచేసిన ప్రియాంక చతుర్వేది.. కాంగ్రెస్ పార్టీలోని‌ అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.