ప్రియాంక పరువు తీసేసిందిగా..!!!

ప్రియాంక పరువు తీసేసిందిగా..!!!

ప్రియాంక చోప్రా ఇండియన్ టాప్ హీరోయిన్... హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకొని అమెరికా వెళ్ళింది.  అక్కడ టాప్ మ్యాగజైన్లకు వరసగా ఫోటో షూట్లు చేసు బిజీ అయ్యింది.  ఫోటో షూట్ చేయడం వరకు సరే.. ఆ ఫోటో షూట్ లు అంతకు మించేలా అనిపిస్తుండటంతో విమర్శలకు తెరలేపింది.  

రీసెంట్ గా ప్రియాంక ఇన్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఇందులో చీర కట్టుకొని బ్యాక్ ఫోజుతో అదరగొట్టింది. చీర కట్టులో అందంగా కనిపించే ప్రియాంక ఏకంగా జాకెట్ లేకుండా చీరతో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు  మండిపడుతున్నారు.  ప్రియాంక జాకెట్ లేకుండా చీర కట్టుకొని ఫోటోలు దిగి ఇండియా పరువు తీసిందని నెటిజన్లు వాపోతున్నారు.