ట్రైలర్: ది వైట్ టైగర్‌గా గ్లోబల్ బ్యూటీ

ట్రైలర్: ది వైట్ టైగర్‌గా గ్లోబల్ బ్యూటీ

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది వైట్ టైగర్’. ఈ సినిమా రమిన్ బహ్రానీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా ఫేమస్ నవల ’ది వైట్ టైగర్’ ఆధారంగా చిత్రించనున్నారు. ఈ నవలను ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రాశారు. ఈ నవల 2008లో న్యూయార్క్ బెస్ట్ సెల్లర్‌గా అవార్డు అందుకుంది. విదేశాల నుంచి వ్యాపారం చేయాలని వచ్చే పాత్రలుగా ప్రియింకా, రాజ్ కుమార్ కనిసించనున్నారు. అందులో మరో ప్రధాన పాత్రైన పేద డ్రైవర్‌గా ఆదర్శ్ గైరవ్ కనబడనున్నాడు. వారిని తన తెలివితేటలతో నమ్మించి మోసం చేసి తాను ఎలా ధనవంతుడయ్యాడన్న దానిపై సినిమా నడవనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూసిన వారు ఈ సినిమాను మంచి థ్రిల్లర్‌గా భావిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోనుందో చూడాల్సి ఉంది.