ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్ అయిపోయింది

ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్ అయిపోయింది

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. రెండు నెలల నుంచి డేటింగ్ చేస్తున్న హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనాస్ తో పీసీ నిశ్చితార్థం లండన్ లో జరిగింది. వారం క్రితం ప్రియాంక బర్త్ డే సందర్భంగా నిక్ ప్రియాంక వేలికి ఉంగరం తొడిగినట్టు ‘పీపుల్‘ మేగజైన్ తెలిపింది. నిక్ ఈ ఖరీదైన ఉంగరాన్ని న్యూయార్క్ లో కొన్నట్టు తెలిసింది. నిశ్చితార్థం సజావుగా జరగడంతో ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారని పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అమెరికా మీడియాలో సైతం ఈ సెలబ్రిటీ ఎంగేజ్ మెంట్ ని నిర్థారిస్తూ పలు కథనాలు వచ్చాయి. ఇటీవల ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించినపుడు ఆమె వేలికి వజ్రపు ఉంగరం కనిపించింది. కెమెరాలు తనపై ఫోకస్ చేయగానే పీసీ తన ఉంగరాన్ని దాచేందుకు ప్రయత్నించింది. అది చూసినప్పటి నుంచి నిశ్చితార్థం జరిగిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజమైందని పేజ్ త్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇక త్వరలోనే చోప్రాల ఇంటిలో పెళ్లి బాజాలు మోగుతాయని తెలిసింది.