ఈ ఫోటో అర్ధం ఏంటి గురూ..!!

ఈ ఫోటో అర్ధం ఏంటి గురూ..!!

కొన్ని కొన్ని ఫోటోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఫోటోలు ఆలోచనలను రేకిస్తుంటాయి.  మరి కొన్ని ఫోటోలు చూడగానే ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి.  కొన్ని మాత్రం ఎవరికి అర్ధం కానట్టుగా ఉంటాయి.  అచ్చంగా ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ లాగ.  తాళికట్టే ముందు చివరిసారిగా మనసారా నవ్వుకొని తాళికట్టు అని చెప్పినప్పుడు వెంకటేష్ మోహంలో కనిపించే ఆ ఎక్స్ ప్రెషన్ ఎవరికీ అర్ధం కాదు.  పెళ్లి తరువాత.. దాని అర్ధం ఏంటో తెలుసుకుంటాడు.  

పెళ్లికి ముందు ఈ జంట.. చెట్టపట్టాలు వేసుకొని తిరుగారు.  పెళ్లి తరువాత కూడా అలాగే ఎంజాయ్ చేశారు.  ప్రస్తుతం ఈ జంట న్యూయార్క్ లో ఉంటోంది.  ఇప్పటికే ఆ జంట ఎవరో అర్ధం అయ్యే ఉంటుంది.  ప్రియాంక చోప్రా, నికి జోనస్ లు.  న్యూయార్క్ లో ప్రియాంక రోడ్డు క్రాస్ చేస్తుంటే.. వెనకనుంచి ఓ వ్యక్తి గొడుగు పడుతున్నాడు.  ముందు నికి జోనస్ ఆమె చేయి అందుకొని నడుస్తున్నాడు.  ఇందులో ఏముంది మామూలే కదా అని అనుకోకండి.. సరిగ్గా చూడండి.  వెనక ఉన్న వ్యక్తి ప్రియాంక చోప్రాకు మాత్రమే గొడుగు పడుతున్నాడు.  దీనికి అర్ధం ఏంటో మీరే ఊహించుకోండి.