ఇథియోపియాలో ప్రియాంక చోప్ర !

ఇథియోపియాలో ప్రియాంక చోప్ర !

స్టార్ నటి ప్రియాంక చొప్త యూనిసెఫ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఆ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా ఆమె ఇథియోపియాలో పర్యటిస్తున్నారు.  ముందుగా అక్కడి మహిళలని కలిసి పలు అంశాల మీద చర్చలు జరిపిన ఆమె వారి సంప్రదాయాల్ని కూడా ఫాలో అయ్యారు.  ఇథియోపియన్ల సాంప్రదాయంలో నృత్యం చాలా ప్రధానమైంది.  అందుకే ప్రియాంక వారితో పాటే ఆడి పాడారు.  భాష రాకపోయినా సంతోషాన్ని డ్యాన్స్ ద్వారా షేర్ చేసుకున్నమని ఈ సందర్భంగా ప్రియాంక తెలిపారు.