అమ్మ మనసును చాటుకున్న ప్రియాంక గాంధీ

అమ్మ మనసును చాటుకున్న ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ అమ్మ మనసును చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం ట్యూమర్ తో బాధపడుతున్న రెండున్నరేళ్ల బాలికను చికిత్స కోసం తన చార్టెడ్ విమానంలో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. మొదట ఆ బాలిక చికిత్స కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. తమ పాప వైద్య ఖర్చులను భరించే స్తోమత తమకు లేదని ఆదుకోవాలంటూ ప్రయాగ్ రాజ్ లో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకను తల్లిదండ్రులు ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆమె సీనియర్‌ పార్టీ నాయకుడు రాజీవ్‌ శుక్లా, హార్ధిక్‌ పటేల్‌, మహ్మద్‌ అజారుద్దీన్లను సంప్రదించారు. మెరుగైన  వైద్యం కోసం పాపను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వారు ఆరు సీట్లు చార్టర్ విమానంలో మైనర్‌ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. కాంగ్రెస్‌నేత అజరుద్దీన్‌ను వారికి సాయంగా ఉండేందుకు ఆ విమానంలోనే పంపారు.