ఆమె వాద్రా కంటే నన్నే ఎక్కువ తలుచుకుంటోంది..!

ఆమె వాద్రా కంటే నన్నే ఎక్కువ తలుచుకుంటోంది..!

ఎన్నికల సమయంలో నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు మామూలే... ఇక ప్రముఖులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో ఇది మరీ ఎక్కువ. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో ఓడిపోయిన స్మృతీ ఇరానీ... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, సోదరుడి తరపున ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ.. స్మృతీ ఇరానీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అయితే, ఇవాళ ఐదో విడుత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన స్మృతీ ఇరానీ... ప్రియాంక గాంధీపై సెటైర్లు వేశారు. ఐదేళ్ల క్రితం తన పేరు కూడా తెలియని ప్రియాంక గాంధీ.. ఇవాళ తరుచూ తన పేరే తలుచుకుంటున్నారని.. ఆఖరికి ఆమె భర్త రాబర్ట్ వాద్రా కంటే ప్రియాంక గాంధీ తన పేరునే ఎక్కువగా తలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి చావో రేవో లాంటివి.. ఎన్నికల్లో మా ప్రధాన అజెండా అభివృద్దే. అమేథీలో ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిందేమి లేదు. చేసిందంతా రాబర్ట్ వాద్రా అభివృద్ది కోసమే చేశారు తప్ప ఇంకేమి లేదంటూ మండిపడ్డారు స్మృతీ ఇరానీ.