పాములతో సరదాగా గడిపిన ప్రియాంక గాంధీ

పాములతో సరదాగా గడిపిన  ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో తన తల్లి సోనియాగాంధీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆమె రాయ్‌బరేలిలో పాములు ఆడించేవారిని కలుసుకొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు.. పాములను ఆమెకు చూపించగా.. ఆమె ఒక పామును చేతిలో పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.