పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తా: ప్రియాంక గాంధీ వాద్రా

పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తా: ప్రియాంక గాంధీ వాద్రా

పార్టీ నాయకత్వం తను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటే పోటీ చేస్తానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం స్పష్టం చేశారు. అమేథీలో మీడియాతో మాట్లాడుతూ 'ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోలేదు. కానీ పార్టీ నేను పోటీ చేయాలని కోరుకుంటే నేను తప్పక పోటీ చేస్తానని' ప్రియాంక అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తే రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారా లేదా అమేథీ నుంచినా అన్న మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం తన దృష్టంతా పార్టీ అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చడం మీదే ఉందని, ఇంకా చేయాల్సింది ఎంతో మిగిలే ఉందని చెప్పారు. 

ఎన్నికల సమయంలోనే ఆమెకు దేవాలయాలు గుర్తుకొస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై 'నేను ఎప్పుడు, ఎక్కడికి వెళ్తానో ఆయనకెలా తెలుసు? ఎన్నికలు లేనపుడు నేను వెళ్లనని ఆయనకెలా తెలిసింది?' అని ప్రశ్నించారు.