సూర్య సినిమా నుంచి రష్మిక అవుట్.. రేసులో నాని హీరోయిన్ !
తమిళ హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి భారీ హిట్ సినిమా తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'జ్ఞానవేల్' అనే డైరెక్టర్ తో సినిమా చేస్తుండగా.. దీని తర్వాత పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఆ తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య ‘వాడివాసల్’ సినిమా చేస్తాడు. తాజా సమాచారం ప్రకారం సూర్య, పాండిరాజ్ దర్శకత్వంలో సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం. చాలా రోజుల నుంచి ఈ ముచ్చట వినిపిస్తున్న తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈమెను కన్ఫామ్ చేశారనే వినిపిస్తుంది. ఈ బ్యూటీ నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్గా పరిచయమై ఆకట్టుకుంది. కాగా, గత కొద్దిరోజులుగా సూర్య పక్కన రష్మిక మందన్నను హీరోయిన్గా ఒప్పించడానికి చాలానే ప్రయత్నాలు చేశారట నిర్మాతలు. రష్మిక పలు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పడంతో పాటుగా, ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ కోరిందట. దింతో ప్రియాంక అరుల్ మోహన్ ను దాదాపుగా ఖరారు చేసినట్లుగా కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)