ప్రియాంక రెడ్డి ఇంటి వద్ద ఆందోళన - గేటుకు తాళం 

ప్రియాంక రెడ్డి ఇంటి వద్ద ఆందోళన - గేటుకు తాళం 

ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు.  రాజకీయ నాయకులు, మీడియా, విఐపిలు అందరు వచ్చి పరామర్శించి వెళ్తున్నారు తప్పించి నిందితుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి కాలనీ గేటుకు లాక్ చేశారు.  ఎవరు వచ్చినా లోనికి రానివ్వమని, నిందితులను భద్రతను కల్పిస్తూ.. జైలుకు తీసుకెళ్లడం సరికాదని, నిందితులు ఎవరో తెలిసినా ఇంకా వారిపై చర్యలు తీసుకోకుండా జైలుకు పంపించడం సరికాదని, వారికీ తగిన శిక్షను వెంటనే అమలు చేయాలనీ చెప్పి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అంటున్నారు.  

ఈ విషయంలో  పీఎం కూడా స్పందించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకున్న తరువాత ఎవరినైనా లోనికి అనుమతిస్తామని, అప్పటి వరకు ఏ ఒక్కరు కూడా లోనికి రావడానికి వీలులేదని చెప్పి లాక్ చేశారు. అందరూ వచ్చి చూసి సానుభూతి ప్రకటించి వెళ్లిపోతున్నారు తప్పించి తమకు న్యాయం చేయడం లేదని కుటుంబ సభ్యులతో పాటు ఆ కాలనీలో ఉండే వ్యక్తులు కూడా చెప్తున్నారు.