ప్రతిదీ కొనలేరు.. అందరినీ బెదిరించలేరు: ప్రియంక

ప్రతిదీ కొనలేరు.. అందరినీ బెదిరించలేరు: ప్రియంక

ప్రతిదీ కొనేయలేమని బీజేపీ ఏదో రోజు గుర్తిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ కుప్పకూలడంపై ఆమె ట్వీట్‌ చేశారు. ప్రతిఒక్కరినీ బెదరించలేమని బీజేపీ తప్పక గుర్తిస్తుందన్న ప్రియాంక.. ప్రతి అబద్ధం ఆరోజు బయటపడుతుందని అన్నారు. ఆ రోజు వచ్చే వరకు.. అంతులేని అవినీతి ఉన్నా.. ప్రజాస్వామ్యాన్ని బలహినపడుతున్నా భరించాల్సి ఉంటుందంటూ ట్వీట్‌ చేశారు ప్రియాంక.