ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీ వీరికే..

ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీ వీరికే..

ఐపీఎల్‌కు ఉన్న క్రేజేవేరు.. ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ అంటే అభిమానులకు పండుగ.. ఈ సీజన్ ముగిసిందంటే.. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ 2019 సీజన్ కూడా ముగిసింది. 50 రోజుల యుద్ధాన్ని తెగ ఎంజాయ్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్. ఎన్నో రికార్డులు బద్దలు కాగా.. సిక్సర్లతో స్టేడియాలు హోరెత్తిపోయాయి. ఓవైపు ఆటగాళ్ల భావోద్వేగాలు, మరోవైపు ప్రేక్షకుల్లో నరాలు తెగేంత ఉత్కంఠ, ఇలా ఐపీఎల్‌ 12వ సీజన్‌లో మస్త్ మజా పంచింది. ఇక ఒక్క పరుగు తేడాతో ఫైనల్‌లో గెలిచిన ముంబై జట్టు నాల్గోసారి కప్ ఎగరేసుకుపోగా.. విన్నర్, రన్నర్ జట్లతో పాటు వివిధ విభాగాలకు క్రీడాకారులకు కూడా ప్రైజ్ మనీ అందజేశారు. 


ప్రైజ్ మనీ వివరాలు:
* విన్నర్ టీమ్ ముంబైకి రూ.20 కోట్లు
* రన్నర్ టీమ్ చెన్నైకి రూ.12.5 కోట్లు
* స్టైలిష్‌ ప్లేయర్: కేఎల్ రాహుల్‌కు రూ.10 లక్షలు
* ఐపీఎల్ 12 సీజన్ ఉత్తమ్ క్యాచ్‌: శార్దూల్ ఠాకూర్‌కు రూ.10 లక్షలు
* గేమ్ ఛేంజర్: రాహుల్ చాహర్‌కు రూ. 10 లక్షలు
* మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్: బుమ్రాకు రూ. 5 లక్షలు
* ఆరెంజ్ క్యాప్‌: డేవిడ్ వార్నర్‌కు రూ. 10 లక్షలు
* పర్పుల్ క్యాప్: ఇమ్రాన్ తాహిర్‌కు రూ. 10 లక్షలు
* వర్ధమాన క్రికెటర్: శుభ్‌మన్‌గిల్‌కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ పొందారు.