రవితేజ సినిమాకు వింత సమస్య !

రవితేజ సినిమాకు వింత సమస్య !

మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఆరంభంలో 'డిస్కో రాజ' అనే సినిమా స్టార్ట్ చేశాడు.  స్క్రిప్ట్ మొత్తం ముగించుకుంది సినిమా సెట్స్ మీదికి వెళ్లే సమయంలో వింత సమస్య ఒకటి ఎదురైంది.  అదేమిటంటే సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ దశలో ఉన్న వేరొక సినిమాతో మ్యాచ్ అవుతున్నాయట.  ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న రవితేజ వెంటనే వాటిని మార్చి కొత్తవి రాయమని దర్శకుడు విఐ ఆనంద్ ను కోరాడట.  దీంతో షూటింగ్ ఆపి స్క్రిప్ట్ మీద కూర్చున్నాడట దర్శకుడు.  మరి ఈ మార్పులు ఎప్పుడు పూర్తవుతాయో, సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.