ప్రభుత్వం చేతిలో ఏపీ కొత్త డీజీపీ లిస్ట్

ప్రభుత్వం చేతిలో ఏపీ కొత్త డీజీపీ లిస్ట్

ఏపీ కొత్త డీజీపీ ఎంపికపై ఈ రోజు అమరావతిలో కమిటీ సమావేశం అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ సభ్యులు సాంబశివరావు, మన్మోహన్ సింగ్, శ్రీకాంత్ లు సమావేశం అయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, విజిలెన్స్‌ డీజీ అనూరాధ, కేంద్ర సర్వీసులో వీఎస్‌కే కౌముదీ పేర్లను కమిటీ ఎంపిక చేసింది. వచ్చే రెండు రోజులో ఏపీ కొత్త డీజీపీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత ఏపీ డీజీపీ మాలకొండయ్య రేపు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీని ఎంపిక చేసే పనిలో కమిటీ ఉంది. అయితే సీఎం చంద్రబాబు కాకినాడలో ధర్మపోరాట దీక్ష ముగించుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.