పవన్ కళ్యాణ్ సినిమా చేయట్లేదు

పవన్ కళ్యాణ్ సినిమా చేయట్లేదు

 

ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో డీలాపడిన పవన్ ఇకపై సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి.  ముందుగా బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా చేస్తారని, దానికి బోయపాటి శ్రీను దర్శకుడని అన్నారు.  ఈ చిత్ర బడ్జెట్ 100 కోట్ల పైమాటే అని ప్రచారం జరిగింది.  ఈ వార్తలపై స్పందించిన బండ్ల గణేష్ తన బ్యానర్లో ప్రస్తుతం సినిమా ఏదీ చేయట్లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతానని అన్నారు.  దీంతో పవన్ తిరిగి సినీ పరిశ్రమకే వస్తారనే వార్తలపై సందిగ్ధం నెలకొంది.