తన దేవుడితో సినిమా అనౌన్స్ చేసిన బండ్ల...

తన దేవుడితో సినిమా అనౌన్స్ చేసిన బండ్ల...

బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో అందరికి తెలిసిందే. అయితే తాను అభిమానిని కాదు భక్తుడిని అని ఆయనే చాలాసార్లు చెప్పాడు. పవన్ విషయంలో ప్రతిసారి తన అభిమానాన్ని చాటుకుంటాడు గణేష్. పవన్ పిలిచిమరీ 'గబ్బర్ సింగ్' సినిమాకి ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ కి బాధ్యతలు అప్పగించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు అప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మంచి హిట్ సినిమాలను నిర్మించిన బండ్ల మధ్యలో రాజకీయాలు అంటూ వెళ్లి మళ్ళీ సినిమాల్లోకే తిరిగివచ్చాడు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించాడు. ఇక ఆ మధ్య నాకు మళ్ళీ పవర్ స్టార్ తో సినిమా నిర్మించే అవకాశం వస్తే నేను తప్పకుండా చేస్తాను. పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా అని చెప్పిన బండ్ల ఇప్పుడు పవన్ తో సినిమాను అనౌన్స్ చేసాడు. తన ట్విట్టర్ లో ''నా బాస్ సరే అన్నారు మరియు మరోసారి నా కలలు నిజమయ్యాయి'' అంటూ పవన్ తో దిగ్గిన ఫోటోను షేర్ చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.