హీరోగా స్టార్ ప్రొడ్యూస‌ర్ కొడుకు

హీరోగా స్టార్ ప్రొడ్యూస‌ర్ కొడుకు

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో వార‌సుల ఆరంగేట్రంపై ప్ర‌ధానంగా చ‌ర్చ సాగుతోంది. సినీరంగంలోనూ వార‌సుల రాక‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ నిరంత‌రం సాగుతూనే ఉంది. త్వ‌ర‌లోనే మెగాస్టార్ అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్‌.. మెగాస్టార్ మ‌రో మేన‌ల్లుడు, సాయిధ‌ర‌మ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్‌ సినీ ఆరంగేట్రంపైనా టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మెగా హీరోల వెల్లువ‌తో పాటు ఇత‌ర‌త్రా సినీ కుటుంబాల నుంచి న‌ట‌వార‌సుల జోరుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 

ఆ క్ర‌మంలోనే ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత‌గా, స‌క్సెస్‌ల మెగా ప్రొడ్యూస‌ర్‌గా పేరున్న డి.వి.వి.దాన‌య్య కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న‌ దానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందుకున్న దాన‌య్య ఇదే హుషారులో జ‌క్క‌న్న‌తో మ‌ల్టీస్టార‌ర్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. మ‌రోవైపు త‌న కొడుకును హీరోని చేయాల‌న్న ఎగ్జ‌యిట్‌మెంట్‌లోనూ ఉన్నార‌ట‌. డెబ్యూ హీరోల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చే తేజ‌ను దాన‌య్య ఇప్ప‌టికే సంప్ర‌దించార‌ని, అలానే ఈ సినిమాలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో అర్జున్‌క‌పూర్ న‌టించిన డెబ్యూ సినిమా `ఇష్క్ జాదే` రీమేక్ హ‌క్కుల్ని దాన‌య్య త‌న కొడుకు సినిమా కోసం తీసుకున్నార‌ని తెలుస్తోంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తార‌ట‌. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలిసింది.