వైసీపీలో చేరిన పీవీపీ

వైసీపీలో చేరిన పీవీపీ

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఎన్నికలకు ఇంకో 27 రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలలో వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో చేరికలు బాగా జరిగాయి. సినీ నటులు జయసుధ, అలీ.. వీరితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి‌ వరప్రసాద్ (పీవీపీ) వైసీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణుతో కలిసి వచ్చి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పీవీపీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పీవీపీకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.