పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న ప్రొడ్యూసర్లు.

పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న ప్రొడ్యూసర్లు.

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రం చేస్తున్న పవన్ తరువాత వరుసగా క్రిష్ దర్శకత్వంలో ,అలాగే తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లోనూ సినిమా  చేస్తున్నాడు. ఇక సురేందర్ రెడ్డితో ఓ సినిమా , వీటితోపాటు మళయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుం కోషియం' అనే మల్టీ స్టార్రర్  సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటు తన అభిమాని నితిన్  ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మొదట ఆ పాత్ర కోసం రానాని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ చివరికి పవర్ స్టార్ భక్తుడు నితిన్ కి దక్కింది. ఇక రీసెంట్ గా మరో కొత్త దర్శకుడితో సినిమాని ప్రకటించి ఫాన్స్ లో మంచి జోష్ నింపాడు.

ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు. 'ఓ మై ఫ్రెండ్' ,'ఎంసిఏ' చిత్రాల దర్శకుడు వేణు శ్రీ రామ్  ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ,బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కరొన కారణంగా ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి.కానీ పవన్ సినిమా దాదాపు ఏడు నెలలు నుంచి  షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. పవన్ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళికి మొదలుపెట్టిన దీక్ష కారణంగా షూటింగ్ కి రాలేదు. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ,వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని పవన్ భావిస్తున్నాడట.