కోర్టు కేసు నుండి బయటపడ్డ నిర్మాతలు !

కోర్టు కేసు నుండి బయటపడ్డ నిర్మాతలు !

కొన్నేళ్లుగా కోర్టులో నానుతున్న ఒక కేసు నుండి నిర్మాతలు సి. కళ్యాణ్, శింగనమల రమేష్ బయటపడ్డారు.  వివరాల్లోకి వెళితే కొన్నాళ్ల క్రితం కొమురం పులి, ఖలేజా సినిమా హక్కుల్ని అడిగినందుకు తమను భాను కిరణ్ సహకారంతో బెదించారని షాలిమార్, యూనివర్సల్ వీడియోస్ సంస్థలు కేసు వేశాయి.  కానీ సరైన సాక్ష్యాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ నాంపల్లి సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది.