పవన్ సినిమా కోసం సెట్స్ వేస్తున్నారట... 

పవన్ సినిమా కోసం సెట్స్ వేస్తున్నారట... 

పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి అడుగుపెడతారా లేదా అనే డౌట్ అందరిలో ఉన్నది.  పవన్ కళ్యాణ్ రాజకీయ రంగానికే పరిమితమవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  కానీ, దర్శకనిర్మాతలు మాత్రం పవన్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.  

బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, దిల్ రాజులు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ కూడా వేస్తున్నారని సమాచారం.  అమితాబ్ పాత్రలో పవన్ నటిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.  సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే తప్పేంటని పవన్ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఇదే అనుకోవచ్చు.  ఇదే నిజమైతే.. పవన్ అభిమానులకు పండుగనే చెప్పాలి.