అనూహ్య లాభాలతో నిఫ్టి

అనూహ్య లాభాలతో నిఫ్టి

మిడ్ సెషన్‌ వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి యూరప్‌ లాభాలతో యూటర్న్‌ తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉండటం, ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడంతో నిఫ్టి ఆరంభంలోనే భారీగా నష్టపోయింది. 11612 వద్ద ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో 11569కి పడిపోయింది. తరవాత ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులు కూడా గణనీయంగా పెరగడంతో నిఫ్టి జోరందుకుంది.  ఒక్క మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ, ప్రైవేట్‌, రియల్‌ ఎస్టేట్‌, ఆటో కంపెనీల షేర్ల సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఏషియన్‌ పెయింట్స్‌ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, విప్రో, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఐసీఐఐ బ్యాంక్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. \

ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్టెల్‌, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.అశోక్‌ లేల్యాండ్‌ 5.5 శాతం పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌ 12 శాతం పెరిగింది. లిండే ఇండియా 8 శాతం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ 6 శాతం, ఐటీఐ, అశోక్‌ లేల్యాండ్‌ 5 శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ఆర్‌ కామ్‌, స్టెర్‌లైట్‌ టెక్నాలజీ, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి.