అయోధ్యలో 144 సెక్షన్ అమలు

అయోధ్యలో 144 సెక్షన్ అమలు

అయోధ్యలో ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన రాయి వేసేందుకు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తలపెట్టిన పాదయాత్ర నేపథ్యంలో ఫైజాబాద్ యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో అయోధ్యలో నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చింది. బాబ్రీ మసీదు స్థలం సమీపంలో సేకరించిన వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు కొన్ని సంస్థలు ప్రకటించాయి.  దీంతో అయోధ్యలో 144 సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు. రామజన్మభూమి ఆలయం వద్దకు చేరుకునేందుకు ఒకే ఒక్క రోడ్డు మార్గంలో మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన రోడ్డు మార్గాలను మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. 15 మందికి మించిన ఏ బృందాన్ని కూడా ఆలయ స్థలంలోకి అడుగుపెట్టనీయమని పోలీసు అధికారులు చెప్పారు.