'టిక్ టిక్ టిక్' న్యూ ప్రోమో

'టిక్ టిక్ టిక్' న్యూ ప్రోమో

త‌మిళంలో ఎంద‌రు స్టారాధిస్టార్లు ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక దారి ఉంద‌ని నిరూపించిన యువ‌న‌టుడు జ‌యం ర‌వి. తెలుగు సినిమా జ‌యం రీమేక్‌తో త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోగా వెలిగిపోయిన ర‌వి .... జ‌యం ర‌విగా మారాడు. ఆ త‌ర‌వాత అత‌డు ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. ఇటీవ‌లే త‌ని ఒరువ‌న్ (ధ్రువ‌-తెలుగు) చిత్రంతో మిరాకిల్ అనిపించే విజ‌యం అందుకున్నాడు. సెల‌క్టివ్‌గా క‌థ‌లు ఎంచుకుంటూ వైవిధ్యంతో దూసుకొస్తున్న హీరోగా జ‌యం ర‌వి పేరు మార్మోగిపోతోంది. ఆ క్ర‌మంలోనే అంత‌రిక్షం నేప‌థ్యంలో ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాడు అన‌గానే జ‌నం అంతా అటువైపు చూశారు. 

జ‌యం ర‌వి హీరోగా, నివేద పుదిరాజ్ హీరోయిన్‌గా శ‌క్తి సౌంద‌ర రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి స్పేస్ సినిమా `టిక్ టిక్ టిక్‌` తెర‌కెక్కింది. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల కారణాల‌తో వాయిదా ప‌డింది. మ‌ధ్య‌లో జ‌బ‌క్ బ్ర‌ద‌ర్స్(నిర్మాత‌లు)ని ఆర్థిక క‌ష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మొత్తానికి జ‌యం ర‌వి సినిమా ఎన్నో అవాంత‌రాల మ‌ధ్య, ఆర్థిక క‌ష్టాల మ‌ధ్య‌ తెర‌కెక్కి ఎట్ట‌కేల‌కు రిలీజ‌వుతోంది. ఈనెల 22న రిలీజ్ అంటూ ప్రోమోలో వేశారు. ఇప్ప‌టికే ప్రోమోలు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజైతే అంత‌రిక్షం నేప‌థ్యంలో తొలి సౌత్ సినిమా, తొలి ఇండియ‌న్ సినిమా ఇదే అవుతుంది. త‌దుప‌రి వ‌రుణ్ తేజ్‌-సంక‌ల్ప్ స్పేస్ సినిమా బృహ‌త్త‌ర ప్ర‌య‌త్నానికి ఈ సినిమా విజ‌యం ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంది.