తెలంగాణ ఇంటర్‌ బోర్డు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్‌ బోర్డు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల నేపథ్యంలో చెలరేగిన ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజూ  ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇవాళ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇంటర్‌బోర్డు ముట్టడికి భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా రావడంతో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు.