రోడ్డు శంకుస్థాపనలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం...

రోడ్డు శంకుస్థాపనలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం...

రోడ్డు శంకుస్థాపన విషయంలో లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన జడ్పీ చైర్మన్ పుట్ట మధును అక్కడ స్థానిక కాంగ్రెస్ ఎంపీపీ,కార్యకర్తలు  అడ్డుకున్నారు. రోడ్డు శంకుస్థాపన విషయంలో మండల అధ్యక్షుడిగా తనను ప్రోటోకాల్ ప్రకారం పిలవలేదని వివాదం చెలరేగింది.  దాంతో కాంగ్రెస్ ఎంపీపీ,కార్యకర్తలు పుట్ట మధు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. మీ జిల్లా కాదు, మీ నియోజకవర్గం కాదు, మీరు కనీసం మా జిల్లా ప్రజాప్రతినిధి కూడా కాదు. అలాంటపుడు మీరు ఎలా శంకుస్థాపన చేస్తారని మల్హర్ మండల ఎంపీపీ,జడ్పీటిసిలు అడ్డుకున్నారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం మమల్ని పిలవాలని కూడా తెలియదా ప్రశ్నించారు. దాంతో అక్కడ అధికార, ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం ముగిసింది.