ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ

ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ

విజయవాడలో రేపు  జరిగే ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ మొక్క భవన ప్రారంభోత్సవ ఆహ్వాన ప్రతికలో స్ధానిక ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు పేర్లు లేకపోవడం వివాదానికి తెరలేపింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. విజయవాడ ఐటీఐ రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనాన్ని రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో స్ధానిక ఎంపీ కేసినేని నాని, స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు లేకపోవడంతో టీడీపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. ప్రారంభోత్సవ సమయంలో  ఈ విషయమై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా పాటించరా.. అంటూ ఎంపీ కేసినేని నాని మద్దతుదారులు మండిపడుతున్నారు.