మెగా ఫ్యామిలీ గురించి పృథ్వి క్లారిటీ

మెగా ఫ్యామిలీ గురించి పృథ్వి క్లారిటీ

గడిచిన ఎన్నికల్లో కమెడియన్ పృథ్వి వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు.  దీంతో మెగా అభిమానుల్లో ఆయనపై ఒకింత కోపం నెలకొన్న మాట వాస్తవమే.  అయితే దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు పృథ్విని మెగా హీరోలు తమ సినిమాల నుండి పూర్తిగా బహిష్కరించారని, ఫలితంగా బన్నీ కొత్త సినిమా నుండి కూడా పృథ్విని  తొలగించారని వార్తలు పుట్టించారు.  గత మూడు నాలుగు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి.  వీటిపై స్పందించిన పృథ్వి అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చేశారు.  తనను ఎవరూ బ్యాన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.  అసలు తనకు త్రివిక్రమ్, బన్నీ సినిమాలో ఆఫర్ రానేలేదని అన్నారు.