జగన్ సీఎం.. తలనీలాలు సమర్పించిన పృథ్వి !

జగన్ సీఎం.. తలనీలాలు సమర్పించిన పృథ్వి !

ప్రముఖ సినీ హాస్య నటుడు పృథ్వి కొన్నాళ్ల క్రితం వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే.  ఎన్నికల సమయంలో వైకాపా తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు.  అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు.   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ వెంట నడిచినప్పుడు ఆయనకున్న ఆదరణ చూశాను.  వైకాపా 100కి పైగా సీట్లు గెలుస్తుంది.  మొదటిసారి నడిచి తిరుమలకు వచ్చాను.  23న అమరావతిపై వైకాపా జెండా ఎగరడం ఖాయమని అన్నారు.