బన్నీ.. త్రివిక్రమ్ సినిమా నుంచి పృద్వి ఔట్..!!!

బన్నీ.. త్రివిక్రమ్ సినిమా నుంచి పృద్వి ఔట్..!!!

సినిమా వేరు రాజకీయం వేరు.. రెండింటికి సంబంధం ఉండదు.  రాజకీయం పరంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.  కానీ, సినిమా విషయానికి వచ్చే సరికి వేరుగా ఉంటుంది.  సినిమా ఇండస్ట్రీలో ఒక పాత్రకు ఒకరే సెట్ అవుతారు.  ఆ పాత్రలో వేరొకని ఊహించలేము. 

ఇప్పుడు రాజకీయాలను, సినిమాలకు ముడిపెట్టే కిరికిరి జరుగుతున్నది.  30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే పృద్వి టాలీవుడ్ సినిమాల్లో కమెడియన్ గా దూసుకుపోతున్నారు.  తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు.  బన్నీ.. త్రివిక్రమ్ సినిమాలో పృద్విని ఓ కీలక పాత్రకు తీసుకున్నారు.  ఎన్నికల సమయంలో పృద్వి వైకాపాకు ప్రచారం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను చిరంజీవిని లేశమాత్రంగా విమర్శించడంతో.. దాని ప్రభావం సినిమాపై పడింది.  

త్రివిక్రమ్.. బన్నీ సినిమా నుంచి పృద్విని పక్కన పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.  పృద్వి పాత్రను మరొకరికి ఆఫర్ చేసినట్టుగా సమాచారం.