జగన్ విజయానికి అదే కారణం

జగన్ విజయానికి అదే కారణం

లోక్ సభ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించింది.  ఈ విజయాన్ని ఆ పార్టీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.  ఈ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి ఈరోజు హైదరాబాద్ లోని బహీర్ బాగ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. 

జగన్ ముఖ్యమంత్రిగా గెలవడం రాష్ట్ర ప్రజలందరికి శుభదినం.  3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాసమస్యలను విన్నారు.  రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ విజయం.  వైకాపా ఈ స్థాయిలో విజయం సాధించడం సంతోషంగా ఉంది.  ఆరు నెలలో జగన్ ఎలాంటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలే చూస్తారు.  కెఏ పాల్ జగన్ ను ఎగతాళి చేశారు.  100 స్థానాలు గెలుస్తారని అంటూ హేళనగా మాట్లాడారు.  100 కాదు ఇప్పుడు ఏకంగా వైకాపా 151 స్థానాలు గెలుచుకుంది. 

లగడపాటి సర్వేపై కూడా పృథ్వి విమర్శలు చేశారు.  రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి గెలవలేదని కాంగ్రెస్ కు పట్టిన గతే టిడిపికి పడుతుందని అన్నారు.