ఎస్వీబీసీ చైర్మన్‌గా నటుడు పృథ్వీరాజ్‌

ఎస్వీబీసీ చైర్మన్‌గా నటుడు పృథ్వీరాజ్‌

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ నియ‌మితుల‌య్యారు.  ఈరోజు తిరుప‌తిలో జ‌రిగిన ఎస్వీబీసీ బోర్డు స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.  ఈ నెల 28న ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌, డైరెక్ట‌ర్‌గా ఆయన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.  టీడీపీ హయాంలో ఈ పదవిని నిర్వహించిన దర్శకుడు రాఘవేంద్రరావు జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేశారు.