పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ విజయవంతం అయ్యింది. ఈ రాకెట్ ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టారు. 5 ప్రైవేట్ ఉపగ్రహాలు కాగా, 14 దేశీయ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొదటిసారి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేసింది. ఉదయం 10:24 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం నిర్వహించారు. బ్రెజిల్ కు చెందిన అమజానియా 1 ఉపగ్రహాన్ని ఇండియా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)