కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. రేపే పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. రేపే పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) సీ46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్  ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. అనంతరం రేపు ఉదయం 5.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్‌ఎల్వీ సీ 46. ఇక, 615కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది పీఎస్‌ఎల్పీ సీ 46 రాకెట్. దీని కాలపరిమితి ఐదేళ్లు. మరోవైపు రాకెట్‌ ప్రయోగాన్ని ముందుగా రేపు ఉదయం 5.27 గంటలకు ప్రయోగించాలని షార్ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డు వస్తాయని అంచనా వేసి.. 3 నిమిషాలు అలస్యంగా... అంటే ఉదయం 5.30కి నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్‌ఎల్వీ సీ 46.