నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46

ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. పీఎస్‌ఎల్‌వీ సీ46 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక ఇవాళ ఉదయం 5.30 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు.ఇస్రో పీఎస్‌ఎల్‌వీని ఉపయోగించడం ఇది 48వ సారి కాగా.. బూస్టర్లు లేకుండా పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ తరహా రాకెట్‌ను వినియోగించడం 14వసారి. ఈ రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రశిబిరాలు, కదలికలను పసిగడుతుంది. ప్రకృతి వైపరిత్యాలపై అధ్యయనం చేస్తుంది.