ఇక యమ స్పీడుగా బ్యాంకు లోన్లు..!

ఇక యమ స్పీడుగా బ్యాంకు లోన్లు..!

బ్యాంకు నుంచి లోన్లు పొందాలంటే చాలా సమయంతో కూడుకున్న పని.. అదే ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయితే.. సవాలక్ష రూల్స్.. దీంతో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఏ విధమైన రుణాలు పొందాలన్నా.. బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అయితే, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న పండుగ సీజన్‌లో లోన్లు తీసుకునేవారిని ఆకర్షించడమే టార్గెట్‌గా పెట్టుకున్న ఎస్బీఐ.. హౌసింగ్, వెహికల్ లోన్లను తక్కువ వడ్డీకి ఇవ్వడంతో పాటు.. రుణాల పరిధిని మరింత పెంచుకోవడానికి ఏకంగా గృహ, వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించేశాయి. 

ఎస్బీఐతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు psbloansin59minutes పోర్టల్ ద్వారా ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను చిన్న, మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు అందిస్తుండగా, ఈ పరిధిని రిటైల్ రుణాలకు వర్తించనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. హౌసింగ్, వెహికల్ లోన్లను కూడా ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఎస్బీఐ అధికారులు తెలిపారు. అయితే.. 59 నిమిషాల్లో లోన్ ప్రాసెస్ నుంచి పూర్తి చేసి.. ఆయా సంస్థలకు వారం రోజుల్లోగా లోన్ మంజూరు చేయనున్నారు.